News February 26, 2026
పార్వతీపురం: ‘అక్షరాంధ్ర పరీక్షల శత శాతం హాజరుకు చర్యలు’

ఈనెల 28న జరగనున్న అక్షరాంధ్ర ప్రీ ఫైనల్ పరీక్షతో పాటు మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు శత శాతం హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు వివరించారు. బుధవారం విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.
Similar News
News April 15, 2026
కర్నూలు @44. 2°C

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News April 15, 2026
అమరావతిలో నేడు కూటమి నేతల కీలక భేటీ?

అమరావతిలో నేడు కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగే ఈ భేటీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. మహిళా బిల్లు ఆమోదం తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలు, కూటమి పార్టీల సమన్వయంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .
News April 15, 2026
NTR: నగ్న చిత్రలు SMలో పెడతానని బెదిరింపు.. చివరికి..!

నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని మహిళను బెదిరించి నగదు వసూలు చేస్తున్న బాల వెంకటేశ్వర్లును భవానిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. భయపడి గతంలోనే బాధితురాలు పలుమార్లు నిందితుడికి నగదు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.


