News February 26, 2026
పార్వతీపురం: ‘అక్షరాంధ్ర పరీక్షల శత శాతం హాజరుకు చర్యలు’

ఈనెల 28న జరగనున్న అక్షరాంధ్ర ప్రీ ఫైనల్ పరీక్షతో పాటు మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు శత శాతం హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు వివరించారు. బుధవారం విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.
Similar News
News April 18, 2026
HYDలో నేడు వీటిలోకి ఫ్రీ ఎంట్రీ

హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం సందర్శనకు నేడు ఫ్రీ ఎంట్రీ. నేడు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవశాన్ని నగరవాసులకు కల్పించింది. సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, భువనగిరి ఫోర్ట్‌ను అందరూ ఫ్రీగా సందర్శించొచ్చు. మరిన్ని వివరాలకు గన్ ఫౌండ్రీలోని కార్యాలయాన్ని లేదా 040-23234942 నం.లో సంప్రదించొచ్చు.

బ్యారేజీల మరమ్మతుల్లో జాప్యం ఎందుకు?: NDSA ఛైర్మన్

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనుల్లో జరుగుతున్న జాప్యంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఏజెన్సీలతో ఉన్న కొన్ని ఒప్పందపరమైన సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి NDSA ఛైర్మన్‌కు వివరించారు.