News March 21, 2025

పార్వతీపురం: అగ్నివీర్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా అభ్యర్థుల దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి ఏ.సోమేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలుపారు. భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 10 వరకు వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 20, 2025

గింజ కోసం మొక్కజొన్న సాగు.. కోత సమయం ఇలా గుర్తించాలి

image

గింజ కోసం సాగు చేసే మొక్కజొన్న కోత సమయాన్ని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. కండెల పైపొరలు ఎండినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల నుంచి కిందకు వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని గింజలను వేలిగోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. కండెలోని గింజలను వేరుచేసి వాటి అడుగు భాగం పరీక్షిస్తే (కొన్ని రకాలలో) నల్లని చారలు కనిపిస్తాయి. ఈ సమయంలో పంట కోస్తే మంచి దిగుబడి వస్తుంది.

News November 20, 2025

జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు: ములుగు ఎస్పీ

image

జిల్లాలోని జర్నలిస్టులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక్క టీం చొప్పున వివరాలను అందజేయాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో పోటీలు నిర్వహించబడతాయని అన్నారు. వివరాలకు స్థానిక ఎస్హెచ్ఓలను సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.

News November 20, 2025

బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

image

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.