News January 30, 2025
పార్వతీపురం అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరి

పార్వతీపురం అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరీ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన డాక్టర్ దిలీప్ కిరణ్ ఏసీబీకి బదిలీపై వెళ్లనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన నుంచి నేటి వరకు అదనపు ఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.
Similar News
News December 2, 2025
ADB: మరోసారి అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు..!

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా రెండో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.
News December 2, 2025
ఎంపీ ఉదయ్కి సెకండ్ ర్యాంక్

ఆంధ్రప్రదేశ్ ఎంపీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రెండో స్థానంలో నిలిచారు. పూణేకు చెందిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సెఫలాజికల్ స్టడీ వారు నిర్వహించిన సర్వేలో ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలపై చేసిన ఈ సర్వేలో ఉదయ్ శ్రీనివాస్ 8.6 స్కోరు సాధించి, బెస్ట్ పర్ఫామెన్స్ చూపారు.
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.


