News March 26, 2025
పార్వతీపురం: అన్న క్యాంటీన్ టైం టేబుల్ మార్పు

అన్న క్యాంటీన్ భోజనాల సమయాల్లో మార్పులు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమయాల్లో మార్పు ఇలా ఉండనుంది. • బ్రేక్ ఫాస్ట్: ఉదయం 7 గంటల నుంచి 8:30గంటల వరకు • లంచ్: మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు• డిన్నర్: సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ఉండనున్నాయి.
Similar News
News April 24, 2025
మల్యాలలో భూభారతి అవగాహన సదస్సు

మల్యాల మండలం ముత్యంపేట గ్రామం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈరోజు భూభారతి పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News April 24, 2025
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు: బీసీసీఐ

ఇకపై భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఉండబోవని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. IND, PAK మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ICC టోర్నీల్లో మాత్రమే IND, PAK తలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇక భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించవద్దని BCCI నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News April 24, 2025
భట్టిప్రోలులో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

బాపట్ల జిల్లా భట్టిప్రోలులో బుధవారం రాత్రి రేపల్లె డెల్టా రైలు కింద పడి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. సదరు వ్యక్తి ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడు కనపర్తి సందీప్(17)ను అద్దేపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భట్టిప్రోలు పోలీసులు తెలిపారు.