News March 11, 2025
పార్వతీపురం: అప్పారావు కుటుంబ ఆచూకీ లభ్యం

కొనేరు అప్పారావు కుటుంబ ఆచూకీ లభ్యమైందని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అప్పారావు కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ, తమిళనాడుకి చెందిన అన్నాదురై దగ్గర గొర్రెల కాపరిగా పనిచేస్తున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారన్నారు.
Similar News
News November 12, 2025
ఏలూరు: గ్రంథాలయ భవనాన్ని తనిఖీ చేసిన జేసీ

ఏలూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి, శిథిలావస్థలో ఉన్న భవన పరిస్థితిని పరిశీలించారు. గ్రంథాలయ నిర్వహణకు అనుకూలమైన వసతి అంశాన్ని త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, సేవలను విస్తృత పరిచేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 12, 2025
ఏలూరు: గ్రంథాలయ వారోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

ఏలూరులో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈనెల 14 నుంచి 20 వరకు జరుగు” 58 వ” జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పోస్టర్ను కలెక్టర్ వెట్రిసెల్వి కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించారు. గ్రంథాలయాల ద్వారా విద్యార్థులకు మరి ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రంధాలయ సంస్థ సిబ్బంది ఎల్.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 12, 2025
పెళ్లికీ ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఉండాలి: కాజోల్

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలని అన్నారు. ‘సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని ఏంటి నమ్మకం? అందుకే రెన్యువల్ ఆప్షన్ ఉండాలి. ఎక్స్పైరీ డేట్ ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు’ అని చెప్పారు. తాను, ట్వింకిల్ ఖన్నా కలిసి నిర్వహిస్తున్న టాక్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాజోల్ కామెంట్స్పై మీరేమంటారు?


