News March 12, 2025

పార్వతీపురం: అప్పారావు కుటుంబం ఆచూకీ లభ్యం

image

తమిళనాడులో 20 ఏళ్లుగా చిక్కుకున్న అప్పారావు కుటుంబం ఆచూకీ లభ్యమైనట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో గల బంధుగాం బ్లాక్ చినవల్లాడకి చెందిన వ్యక్తిగా తెలిపారు. ఆయన కుమార్తె దుంబుదొర సాయమ్మ, అల్లుడు చందు పార్వతీపురం మండలం మునక్కాయవలసలో నివసిస్తున్నారని తెలిపారు. తమిళనాడు కలెక్టర్‌తో మాట్లాడి అప్పారావును తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

Similar News

News April 17, 2026

20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

image

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.

News April 17, 2026

కామారెడ్డి: ఈ నెల 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

image

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షను ఈ నెల 19 (ఆదివారం) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. 7వ నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. www.tgms.telangana.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

News April 17, 2026

ఉమ్మడి జిల్లా జెడ్పీ సీఈవోగా విజయలక్ష్మి

image

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈవోగా విజయలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం గుంతకల్లు డీడీవోగా పనిచేస్తున్న ఆమెను జెడ్పీ రెగ్యులర్ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఆమె నియామకంపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. శుక్రవారం విడుదలైన ఆదేశాల మేరకు ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.