News April 11, 2024
పార్వతీపురం: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పార్వతీపురం మండలం హెచ్ కారడవలస గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పార్వతీపురం రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్ల బురిడీ గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళుతున్న ఆటో కారాడవలస సమీపంలో బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో పైలా సింహాచలం (67) మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామన్నారు.
Similar News
News February 17, 2026
VZM: ‘లింగ వివక్షతను అరికట్టాలి’

సమాజంలో ఉన్న లింగ వివక్షత, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు కేవలం చట్టాలు మాత్రమే సరిపోవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.జీవనరాణి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి, ప్రజలకు విస్తృతమైన అవగాహన అవసరమన్నారు. ఈ మేరకు విజయనగరం DMHO కార్యాలయంలో ‘లింగ వివక్షత ఆధారిత హింస నివారణ, సామర్థ్య పెంపుదల’ అనే అంశంపై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
News February 16, 2026
విజయనగరం కలెక్టరేట్‌కు 259 వినతులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 పీజీఆర్ఎస్‌కు, 93 రెవెన్యూ క్లినిక్‌కు వచ్చాయి. డీఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి. శాంతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News February 16, 2026
VZM: ‘జిల్లా ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి’

విజయనగరం జిల్లాలోని సాగు, త్రాగునీటి ప్రాజెక్టులను, కాలువలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిని ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు ఆదినారాయణ, రామారావు మాట్లాడుతూ..జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, సాగునీరు ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.


