News February 18, 2025
పార్వతీపురం: ఆమె రాకతోనైనా సమస్య తీరనుందా?

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏళ్ల తరబడి ఏనుగుల సమస్య పట్టిపీడుస్తోంది. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో 7 ఏనుగులు ఉండగా, పాలకొండ నియోజకర్గంలో 4 ఏనుగులు సంచరిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, వందల ఎకరాల్లో పంటలను ఏనుగులు పాడుచేశాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ముఖ్య అటవీ శాఖ కన్జర్వేటర్ శాంతిప్రియ మంగళవారం(నేడు) పర్యటించనున్నారు. ఆమె పర్యటనతోనైనా ఈ సమస్యకు చెక్ పడుతుందేమో చూడాలి.
Similar News
News December 1, 2025
చైనాలో నిరుద్యోగం.. సివిల్స్ పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

చైనాలో సివిల్స్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత వయసు 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో ఏకంగా 37 లక్షల మంది పరీక్ష రాశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 70% కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.
News December 1, 2025
HYD: ఆన్లైన్ బెట్టింగ్.. మరో యువకుడు బలి

ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఉప్పల్కు చెందిన సాయి (24) శాంతినగర్లో పురుగుల మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతి స్థానికంగా కలకలం రేపింది.