News March 5, 2026
పార్వతీపురం: ఆర్ అండ్ బీ పనుల్లో వేగం పెంచాలి

జిల్లాలో కొనసాగుతున్న రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 1,030 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నెట్‌వర్క్ ఉందని, ఇందులో 464 కి.మీ. స్టేట్ హైవేలు, 566 కి.మీ. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు ఉన్నాయని తెలిపారు. మెజారిటీ పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు.
Similar News
News April 13, 2026
త్వరలో అప్పన్న ట్రస్ట్ బోర్డు ప్రకటన

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు దాదాపు ఖరారైంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపిన ప్రకారం సభ్యుల జాబితా 2, 3 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి ఐఏఎస్ అధికారులకు ఎక్స్‌ఆఫీషియోగా అవకాశం కల్పించనున్నారు. పార్టీకి సేవలందించిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి, కృష్ణ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. అలాగే జనసేన, BJP నేతలకు కూడా చోటు దక్కే అవకాశముంది.
News April 13, 2026
డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: సీఎం రేవంత్

TG: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై PM మోదీకి CM రేవంత్ ట్వీట్ చేశారు. ఈ రెండూ వేర్వేరు అంశాలన్నారు. ‘రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళల కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తాం. జనాభా ఆధారిత డీలిమిటేషన్ జరగకుండా మహిళా రిజర్వేషన్ కోటాను వాడుకోవడం సరికాదు. ఇది BJPకి తాత్కాలికంగా లాభం చేకూర్చినా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్‌పై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం అవసరం’ అని పేర్కొన్నారు.
News April 13, 2026
అనకాపల్లి చేరిన రామతీర్థం రాములోరి శోభాయాత్ర

విజయనగరం జిల్లా రామతీర్థం నుంచి బయలుదేరిన శోభాయాత్ర అనకాపల్లి బైపాస్ రోడ్డు తోటాడ జంక్షన్ వద్దకు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా నూకాంబిక అమ్మవారి దేవస్థానం తరపున దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రతినిధులు, 50 మంది భక్తుల సమక్షంలో శ్రీరాములవారి జీర్ణోద్ధారణ నిమర్జన మహోత్సవం నిర్వహిం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక దేవస్థానం ఛైర్మన్ పీలా నాగ శ్రీను, డిప్యూటీ కమిషనర్ సుజాత పాల్గొన్నారు.


