News March 1, 2025
పార్వతీపురం: ఇంటర్ పరీక్షలు.. 586 మంది గైర్హాజరు

కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 9,335 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి 8,749 మంది హాజరయ్యారన్నారు. 586 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరాలు వెల్లడించారు. పరిక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.
Similar News
News March 1, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న నారా లోకేశ్➤ ఇంటర్ పరీక్షలు.. తొలిరోజు 611 మంది విద్యార్థుల గైర్హాజరు➤ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని లోకేష్కు వినతి ➤ కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన➤ రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేశ్ ➤ ఆదోని: వైసీపీని వీడిన 75 కుటుంబాలు➤ లోకేష్ పర్యటనలో ఆసక్తికర ఘటన
News March 1, 2025
విశాఖ: సోదరి ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మహిళ మృతి

విశాఖ సెంట్రల్ జైల్ సమీపంలో ఎస్ఎస్ఎ నగర్ ఎదురుగా బిఆర్ఎస్ రోడ్డులో స్కార్పియో వాహనం ఢీకొని గెడ్డం సావిత్రి(62) అనే మహిళ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు దాటుతుండగా సెంటర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలు ఆనందపురం గ్రామం కాగా స్థానికంగా ఉన్న సోదరి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలిపారు.
News March 1, 2025
నిర్మల్: బైక్ను ఢీకొన్న లారీ.. వ్యక్తికి గాయాలు

నిర్మల్లోని శివాజీ చౌక్ వద్ద సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న బైక్ను లారీ ఢీకొంది. దీంతో బైక్ పై వెళ్తున్న వసంతరావు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పట్టణానికి చెందిన వసంతరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.