News March 3, 2025
పార్వతీపురం: ఇంటర్ పరీక్షలు.. 404 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 404 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. జిల్లావ్యాప్తంగా సోమవారం 34 పరీక్ష కేంద్రాల్లో 8527 మంది విద్యార్థులకు గాను 8123 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 5613 మంది జనరల్ విద్యార్థులకు 5431 మంది విద్యార్థులు హాజరు కాగా, 2914మంది ఒకేషనల్ విద్యార్థులకు 2692 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News November 22, 2025
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
News November 22, 2025
గ్రీన్ ఫీల్డ్ హైవేలో పరిహారం చెల్లింపుల్లో గందరగోళం..!

గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం పూర్తిగా రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సంగెం, నెక్కొండ, గీసుగొండ, పర్వతగిరి మండలాల్లో వేలాది ఎకరాలు ప్రాజెక్ట్లో పోయినా, కొంతమంది రైతులకు మాత్రమే పరిహారం జమ అయింది. భూములు పాస్పుస్తకాల నుంచి తొలగించడంతో రైతుభరోసా కూడా అందక రైతులు కుంగిపోతున్నారు. పంటలు వేయొద్దని అధికారులు చెప్పడంతో జీవనోపాధి సందిగ్ధంలో పడిందని రైతులు వాపోతున్నారు.


