News March 22, 2024

పార్వతీపురం: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పార్వతీపురానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని దిగాలుగా ఉండడంతో, గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం తెలిపాడు. బెటర్ మెంట్‌లో మార్కులు తెచ్చుకోవచ్చని వారు సర్ది చెప్పినా, మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News September 8, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు సెలవు

image

వర్షాల కారణంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ కేంద్ర హెచ్చరికల మేరకు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అన్నారు. ఈ అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు గమనించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News September 8, 2024

విజయనగరం జిల్లాలో రేపు సెలవు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సోమవారం కలెక్టరేట్‌లో జరగవలిసిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News September 8, 2024

విజయనగరం జిల్లా వాసులకు అలర్ట్

image

విజయనగరం జిల్లాలో ఆదివారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.