News February 17, 2025
పార్వతీపురం: ఇటలీలో ఉద్యోగాలంటూ మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. పార్వతీపురానికి చెందిన ఓ ఏజెంట్తో కలిసి ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి వాసి ఈ మోసానికి పాల్పడ్డారు. జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దాదాపు 350 మంది నిరుద్యోగులను ఇటలీ పంపగా.. అక్కడ సరైన ఉద్యోగం లేక మోసపోయారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 12, 2025
అల్లూరి ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. జిల్లాలో అత్యల్పంగా అరకులోయలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులు కనబడక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఏజెన్సీ ప్రజలు చలిమంటలు వేసుకొని వెచ్చదనం పొందుతున్నారు.
News November 12, 2025
భద్రాద్రి : ట్రాన్స్జెండర్ ఆత్మహత్య

కుటుంబ సభ్యులకు దూరమయ్యాననే మనస్తాపంతో ఓ ట్రాన్స్జెండర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ రామగోపాలపూర్లో చోటుచేసుకుంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలం చిన్నమడిసిలేరు గ్రామానికి చెందిన శివప్రసాద్ అలియాస్ రాజేశ్వరి(20) నాలుగు నెలల క్రితం ట్రాన్స్జెండర్గా సర్జరీ చేయించుకుంది. కుటుంబానికి దూరమై బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 12, 2025
గ్రామ పంచాయతీలకు శుభవార్త

AP: పట్టణాభివృద్ధి సంస్థల(UDA) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భూవినియోగ మార్పిడికి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జ్(EDC) విధిస్తారు. ఇందులో 15% UDAలకు, 85% పంచాయతీలకు చెందేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగదు UDA ఖాతాల్లోకి వెళితే తిరిగి రావడం కష్టమని అధికారులు అభిప్రాయపడటంతో వాటా మొత్తం నేరుగా పంచాయతీల ఖాతాలకే జమ అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో గ్రామాలకు అదనపు ఆదాయం లభించనుంది.


