News November 19, 2024
పార్వతీపురం: ఈనెల 25 వరకు అవకాశం
సార్వత్రిక విద్యాపీఠం 2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 25 చివరి తేదీ అని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.టి నాయుడు తెలిపారు. అపరాధ రుసుము రూ. 600తో ప్రవేశం పొందవచ్చని అన్నారు. ఆన్లైన్లో www.apopenschool.ap.gov.in/ap అపరాధ రుసుము చెల్లించి ప్రవేశాలు పొందాలని సూచించారు. >Share it
Similar News
News November 19, 2024
విజయనగరం: రఘురాజుపై అనర్హత వేటు రద్దు
శృంగవరపుకోట నియోజకవర్గ నేత ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటును రద్దు చేస్తూ మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన పై అనర్హత వేటును రద్దు చేస్తూ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధవారం నుంచి ఆయన మండలి సమావేశాలకు హాజరుకానున్నారు.
News November 19, 2024
మీరు కట్టుకున్న శారీ చేనేతేనా..?:RRR
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడారు. నెలలో ఒకరోజు ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించే విధంగా జీవో తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘మీరు సభకు ఇప్పుడు చేనేతే వేసుకున్నారా.. మీ శారీ చేనేతేనా’ అని డిప్యూటీ స్పీకర్ RRR ఆమెని అడిగారు. స్పందించిన ఎమ్మెల్యే మాధవి అవునంటూ నవ్వుతూ బదులిచ్చారు.
News November 19, 2024
VZM: నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 20న విజయనగరం ప్రభుత్వ ITIలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన 18-35 లోపు వయసు యువకులు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాబ్ మేళాలో ప్రముఖ ఫార్మా కంపెనీలు హాజరవుతున్నాయని, ఆసక్తి గల వారు https://naipunyam.ap.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.