News October 21, 2024

పార్వతీపురం: ‘ఈ నెల 31లోగా సలహాలు ఇవ్వండి’

image

జిల్లాలోని మాజీ సైనికులు, వితంతు మాజీ సైనికుల సంక్షేమం కోసం తగిన సూచనలు, సలహాలను ఈ నెల 31లోగా అందజేయాలని విజయనగరం జిల్లా సైనిక సంక్షేమాధికారి కృష్ణారావు తెలిపారు. మాజీ సైనికులు, వితంతు మాజీ సైనికుల సమస్యల సత్వర పరిష్కారం కోసం వచ్చే నెల మొదటి వారంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సైనిక బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News December 27, 2025

మహిళల రక్షణకు 30 మందితో 5 శక్తి టీమ్స్: VZM SP

image

మహిళల రక్షణ కోసం జిల్లాలో 30 మందితో ఐదు ‘శక్తి టీమ్స్’ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందానికి ఎస్ఐ నాయకత్వం వహిస్తారని, మఫ్టీలో విధులు నిర్వహిస్తూ వేధింపులపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. శక్తి యాప్‌పై అవగాహన, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

News December 26, 2025

పిల్లలే దేశ భవిష్యత్‌కు పునాది: VZM కలెక్టర్

image

వీర్ బాల్ దివస్ వేడుకలు విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణితో కలిసి జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వీర్ బాల్ దివస్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు.