News March 28, 2025
పార్వతీపురం: ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి పనులు

ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి వసతులలో పూడికలు తీసే అవకాశం ఉందని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. 331 ప్రహారీ గోడలను మంజూరు చేయగా 317 పనులు ప్రారంభం అయ్యాయని, మిగిలిన పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. వంద ఎకరాలకు మించి ఆయకట్టు ఉన్న చెరువులలో చేపల పెంపకానికి పనులు చేపట్టాలన్నారు. పంట గుంతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
Similar News
News April 4, 2025
BREAKING: SRH ఘోర ఓటమి

SRH హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్పై KKR 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆరెంజ్ ఆర్మీ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ 33, కమిందు 27, నితీశ్ 19, కమిన్స్ 14 మినహా అందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. వైభవ్, వరుణ్ చెరో 3 వికెట్లు, రస్సెల్ 2, హర్షిత్, నరైన్ చెరో వికెట్ తీశారు.
News April 4, 2025
అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్ కంపెనీ

AP: అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లిలో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు లారెస్ సంస్థ ముందుకొచ్చింది. రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొత్త ప్లాంట్ ద్వారా ఫర్మంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేయనుంది. సీఎం చంద్రబాబును కలిసి పెట్టుబడులపై సంస్థ సీఈవో సత్యనారాయణ చర్చించారు.
News April 4, 2025
సంగారెడ్డి: పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి

ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలు, కూలీలకు రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో పరమేశంకు గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.