News January 31, 2025

పార్వతీపురం: ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పిజి.ఆర్.ఎస్ నిలుపుదల

image

జిల్లాలో శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిలుపుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఫిబ్రవరి, 27వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చి, 3వ తేదీన జరుగుతుందన్నారు.

Similar News

News September 18, 2025

నాగాయలంక: పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం.. అసలేమైంది.!

image

నాగాయలంక (M) నాలి గ్రామానికి చెందిన నాయుడు డానియేల్ బాబు (19) గత నెల 28న అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, డానియేల్ తల్లి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ DSP విద్యాశ్రీ, తహశీల్దార్, సీఐ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

News September 18, 2025

పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

image

సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.

News September 18, 2025

కొండాపూర్: గులాబీ మొక్కకు పూసిన విద్యుత్ దీపాలు

image

కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఒక అద్భుత దృశ్యం కెమెరాకు చిక్కింది. ఒక గులాబీ మొక్కకు పువ్వులకు బదులుగా నక్షత్రాలు వికసించినట్లుగా ఆ చిత్రం ఉంది. గులాబీ మొక్కకు దూరంలో ఉన్న రెండు ఇళ్ల విద్యుత్ దీపాలు కెమెరాకు ఇలా కనిపించాయి. ఈ చిత్రాన్ని చూసి చాలా మంది వీద్యుత్ దీపాలు గులాబీ మొక్కకు వికసించినట్లు ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.