News January 30, 2025

పార్వతీపురం: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిందని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలన 11వ తేదీన జరుగుతుందని, 13వ తేదీలోగా ఉపసంహరణ చేసుకోవాలని తెలిపారు.

Similar News

News November 26, 2025

ములకలచెరువు: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అన్నమయ్య జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ నరసింహ వివరాల మేరకు.. కదిరి వైపు నుంచి వస్తున్న కారును ములకలచెరువు మండలం వేపూరికోట వద్ద ఓ లారీ ఢీకొట్టింది. కారులోని ఇద్దరు చనిపోయారు. మృతులు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన వెంకటరమణ, రాజశేఖర్‌గా గుర్తించారు. లారీ మదనపల్లె వైపు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

News November 26, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత..!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో గత రెండు రోజులుగా విపరీతంగా చలి తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కల్వకుర్తి మండలం తోటపల్లిలో అత్యల్పంగా 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి 15.3, యంగంపల్లి 15.4, బొల్లంపల్లి 15.6, కొండనాగుల 16.0, పెద్దముద్దునూరు 16.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. దీంతో ఉదయం వేళలో ప్రజలు చలి తీవ్రతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News November 26, 2025

3,058 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి NOV 29 వరకు ఛాన్స్ ఉంది. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. www.rrbcdg.gov.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.