News January 31, 2025

పార్వతీపురం: ఎస్పీగా బాధ్యతలు..24 గంటల్లోనే ఉద్యోగ విరమణ

image

పార్వతీపురం జిల్లా అదనపు ఎస్సీగా గురువారం ఎల్.నాగేశ్వరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె అమరావతి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. కాగా విధుల్లో చేరిన 24 గంటల్లో తాను విద్యాభ్యాసం ప్రారంభించిన పార్వతీపురంలో ఉద్యోగ విరమణ చేయనుండడం విశేషం

Similar News

News October 14, 2025

పీఎం కిసాన్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించండి: జేసీ

image

వీఆర్‌ఓ, ఎమ్మార్వో లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న పీఎం కిసాన్ దరఖాస్తుల్లోని అవాంతరాలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులకు, ఆర్ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న రైతులకు గ్రామ సచివాలయాల ద్వారా, బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేయించాలని అధికారులకు సూచించారు.

News October 14, 2025

బాధించేవే మెదడులో భారంగా ఉండిపోతాయి..!

image

ప్రేమతో పలకరించిన మాటల కంటే, బాధించిన విమర్శలనే మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీనికి ‘సర్వైవల్ క్యూ మెకానిజం’ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలు మెదడులో బలమైన నాడీ ప్రతిస్పందనలను యాక్టివేట్ చేయడం వల్ల 2 దశాబ్దాలు దాటినా గుర్తుంచుకుంటామని తెలిపారు. ప్రశంసలు సురక్షిత సంకేతాలు కాబట్టి అవి నెల రోజుల్లోనే మసకబారిపోతాయని వెల్లడించారు. మీకూ ఇలానే జరిగిందా?

News October 14, 2025

రేపు వరంగల్‌కు సీఎం.. ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ

image

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా.. బుధవారం ఆమె పెద్దకర్మను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం పర్యవేక్షించారు. హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అవుతున్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, PGR గార్డెన్స్‌ను సీపీ పరిశీలించి సూచనలు చేశారు.