News February 15, 2025

పార్వతీపురం: ఐఆర్ పీడబ్ల్యూ సంస్థ డైరెక్టర్ ప్రకాశ్ మృతి

image

పార్వతీపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు పెద్దిరెడ్ల ప్రకాశ్ విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతికి పట్టణంలో పలువురు సంతాపం తెలిపారు. స్వచ్ఛంద సంస్థ సేవకులుగా ఆయన విజయవంతంగా అనేక కార్యక్రమాలు చేశారని స్థానికులు కొనియాడారు. 

Similar News

News October 19, 2025

ప్రత్తిపాడు: ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

image

ప్రత్తిపాడు (M) ధర్మవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకు లారీని వెనుక వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. దీపావళి పండుగ నేపథ్యంలో విజయవాడ నుంచి ఇచ్చాపురం వెళ్తున్న వసంత్ కుమార్ సంధ్య దంపతులు ఆగి ఉన్న ఒక వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వసంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పండగ వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News October 19, 2025

నిర్మల్: రాష్ట్రంలో మళ్లీ ‘మొదటి’కొచ్చేలా..!

image

2022-23లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన పదో తరగతి ఫలితాలు, 2024-25లో 15వ స్థానానికి పడిపోయిన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయి, మార్కుల పెరుగుదల వంటి అంశాలను రికార్డు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 117 ప్రభుత్వ బడుల్లో 4155మంది చదువుకుంటున్నారు.

News October 19, 2025

వనపర్తి: R&B రోడ్లకు మహర్దశ

image

వనపర్తి నియోజకవర్గంలోని R&B రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని రోడ్ల పునరుద్ధరణకు రూ.80 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా ..
✓ వనపర్తి – గోపాల్ పేట – గండి బుద్దారం రోడ్డుకు రూ.51.54 కోట్లు.
✓ వనపర్తి – రాజపేట రోడ్డుకు రూ.12.82 కోట్లు.
✓ వనపర్తి – చిట్యాల – బుద్దారం రోడ్డుకు రూ.14.68 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు.