News February 15, 2025
పార్వతీపురం: ఐఆర్ పీడబ్ల్యూ సంస్థ డైరెక్టర్ ప్రకాశ్ మృతి

పార్వతీపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు పెద్దిరెడ్ల ప్రకాశ్ విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతికి పట్టణంలో పలువురు సంతాపం తెలిపారు. స్వచ్ఛంద సంస్థ సేవకులుగా ఆయన విజయవంతంగా అనేక కార్యక్రమాలు చేశారని స్థానికులు కొనియాడారు.
Similar News
News March 10, 2026
గ్యాస్ కొరత.. మొబైల్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్?

LPG కొరతతో మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై నిలిచిపోవడమే ఇందుకు కారణం. టెలికం టవర్లు తుప్పుపట్టకుండా తయారీ సమయంలో జింక్‌తో వేసే రక్షణ పొరకు LPG/LNG అవసరం. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్‌కు తగిన LPG లేకపోతే ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో నెట్‌వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని తెలిపారు.
News March 10, 2026
తిరుపతి: పెరిగిన బుకింగ్స్… తగ్గిన సరఫరా

తిరుపతి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. కమర్షియల్ అరకోరా సరఫరా అవుతుండగా.. డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్‌లు భారీగా పెరిగాయి. దీంతో గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్ ఫోన్ నెంబర్ సైతం పని చేయడం లేదు. మరో వైపు బుకింగ్ అయిన వారికి 30 రోజుల పైగా డెలివరీ అయ్యే అవకాశం ఉందని ఏజెన్సీల ప్రతినిధులు తెలిపారు. హోటల్ యాజమాన్యాల వినతి మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో JCతో బుధవారం డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగనుంది.
News March 10, 2026
HYD: MNC కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 137 మందిని మోసం చేసిన ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట్‌కు చెందిన జగదీశ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి నిందితులు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు జక్కుల అజయ్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు శ్రావణి, సద్గుణ్ కోసం గాలిస్తున్నారు.


