News March 1, 2025

పార్వతీపురం: ఒక్క నిమిషం .. వారి కోసం..!

image

పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

Similar News

News March 1, 2025

కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన

image

ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో జరుగుతున్న భూ రీసర్వేను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం పరిశీలించారు. ఎమ్మార్వో శేషఫణితో కలిసి రీ సర్వేలో రైతుల నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకున్నారు. మండలంలో నెలకొన్న భూ, తదితర సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు.

News March 1, 2025

GHMCలో 139 మంది శానిటేషన్ జవాన్ల బదిలీ.!

image

GHMC కమిషనర్ ఇలంబర్తి 139 మంది శానిటేషన్ జవాన్లను బదిలీ చేశారు. మొత్తం 259 మంది సిబ్బందిలో ఐదేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్న వారిని మార్చినట్లు తెలిపారు. నగర శుభ్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శానిటేషన్ సేవల్లో సమర్థత పెంచేందుకు ఈ చర్యలు అవసరమని కమిషనర్ స్పష్టం చేశారు. 

News March 1, 2025

చట్టానికి లోబడి బాధితులకు న్యాయం చేయండి: సీపీ

image

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు బాధితులకు న్యాయం చేయాలని పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అంబర్ కిషోర్ ఝా అధికారులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ శనివారం కమిషనరేట్‌ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌, డివిజినల్‌, జోన్ల వారీగా సమీక్ష జరిపారు.

error: Content is protected !!