News February 6, 2025
పార్వతీపురం: ‘ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదు’

పార్వతీపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు హితవు పలికారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యే వరకు సంబంధిత పిహెచ్సీ వైద్యాధికారి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రసవాలు సురక్షంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News February 23, 2026
నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.
News February 23, 2026
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News February 23, 2026
ఆరోగ్య శని మంత్రం పఠిస్తే?

శని దేవుడు క్రమశిక్షణకు, కర్మానుభవానికి ప్రతీక. జ్యోతిషశాస్త్రం ప్రకారం శని ప్రభావం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందడానికి ‘ఆరోగ్య శని మంత్రం’ పఠించాలని పండితులు చెబుతున్నారు. సుఖ సంతోషాల కోసం దీనిని పఠించాలని అంటున్నారు. మంత్రం: ధ్వజినీ ధామినీ చైవ కంకాళీ కలహప్రియా| కంకటీ కలహీ చైవ తురంగీ మహిషీ అజా| శనైర్నామాని పత్నీనామేతాని సంజపన్ పుమాన్| దుఃఖాని నశ్యేన్నిత్యం సౌభాగ్యమేధతే సుఖమ్||


