News January 25, 2025
పార్వతీపురం: ‘ఓటే సామాన్యుడి ఆయుధం’

ఓటే సామాన్యుడి ఆయుధమని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం కలెక్టరేట్ ఆవరణలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఓటు ప్రతి భారతీయుడి హక్కు అని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2025
నిర్మల్: 5 మండలాల ప్రజలకు శుభవార్త

అభయారణ్యంలోని అటవీ చెక్ పోస్టుల ద్వారా 5 మండలాల ప్రజల వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు జన్నారం మండలంలోని ఇందన్పల్లి FRO శ్రీనివాస్ తెలిపారు. జన్నారం, కడెం, దస్తురాబాద్, దండేపల్లి, ఉట్నూర్ మండలాల వాహనాలకు చెక్ పోస్టుల ద్వారా అనుమతి ఉందన్నారు. ఆ వాహనాల యజమానులు సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ధ్రువీకరణ పత్రాలు చూపించి సహకరించాలన్నారు.
News February 19, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతలు వీరే

* 1998- దక్షిణాఫ్రికా
* 2000- న్యూజిలాండ్
* 2002- భారత్ & శ్రీలంక(సంయుక్తం)
* 2004- వెస్టిండీస్
* 2006- ఆస్ట్రేలియా
* 2009- ఆస్ట్రేలియా
* 2013- భారత్
* 2017- పాకిస్థాన్
News February 19, 2025
అయినవిల్లి : పాము కాటుకు గురైన వ్యక్తి సేఫ్

అయినవిల్లి మండలం వీరవల్లిపాలేనికి చెందిన రామకృష్ణ మంగళవారం తాచుపాము కాటుకు గురయ్యాడు. అతణ్ని గ్రామ సర్పంచ్ బుచ్చిబాబు, పంచాయతీ సభ్యుడు నరసింహమూర్తి అయినవిల్లి PHCకి తరలించారు. డాక్టర్ మంగాదేవి సిబ్బందిని సమన్వయం చేస్తూ సకాలంలో వైద్యం అందించారు. దీంతో అతనికి ప్రమాదం తప్పి, ప్రాణాలు కాపాడుకున్నారు.