News April 14, 2025
పార్వతీపురం కలెక్టరేట్లో ఘనంగా అంబేడ్కర్ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేడ్కర్ తాత్విక చింతన దేశాన్ని నడిపిస్తుందన్నారు. దేశం ఏకతాటిపై నడవడానికి కారణం అంబేడ్కర్ దూర దృష్టి మాత్రమే అన్నారు.
Similar News
News December 29, 2025
మెల్బోర్న్ పిచ్కు డీమెరిట్ పాయింట్.. నెక్స్ట్ ఏంటి?

యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన <<18689522>>బాక్సింగ్ డే టెస్టు<<>> పిచ్కు ICC ‘అసంతృప్తికరం’ అని రేటింగ్ ఇచ్చింది. రెండ్రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో 142 ఓవర్లలో 36 వికెట్లు పడగా, ఒక్క బ్యాటర్ కూడా కనీసం 50 రన్స్ చేయలేకపోయారు. దీంతో MCGకి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. ఇది 5Yrs రికార్డులో ఉంటుంది. 6 పాయింట్లు వస్తే ఏడాది పాటు నిషేధం విధిస్తారు. గత ఐదేళ్లలో MCGకి ఇదే తొలి డీమెరిట్ పాయింట్.
News December 29, 2025
KMR: ప్రజావాణికి 91 దరఖాస్తులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుంచి స్వీకరించి ఆయా శాఖల అధికారులకు పంపాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
News December 29, 2025
UTF జిల్లా అధ్యక్షుడిగా విజయరామరాజు

పశ్చిమగోదావరి జిల్లా UTF నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం ఏకగ్రీవంగా ముగిసింది. జిల్లా అధ్యక్షుడిగా విజయరామరాజు, ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి క్రాంతికుమార్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. నూతన కార్యవర్గంలో మొత్తం 19మందిని వివిధ పదవులకు నియమించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులను UTF నేతలు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.


