News April 14, 2025
పార్వతీపురం కలెక్టరేట్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేడ్కర్ తాత్విక చింతన దేశాన్ని నడిపిస్తుందన్నారు. దేశం ఏకతాటిపై నడవడానికి కారణం అంబేడ్కర్ దూర దృష్టి మాత్రమే అన్నారు.
Similar News
News February 15, 2026
అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో జరిగే సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.
News February 15, 2026
జేఎన్టీయూ హాస్టల్‌లో శ్రీకాకుళం విద్యార్థిని సూసైడ్

కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ.అరుణ(19) ఇవాళ సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పవరం పోలీసులు తెలిపారు. జేఎన్టీయులోని నాగవల్లి లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామం అని చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
News February 15, 2026
శివుడిని లయకారుడు అని ఎందుకు అంటారు?

సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలలో శివుడు ‘లయకారుడు’. అంటే ఈ విశ్వాన్ని ఉపసంహరించేవాడు అని అర్థం. అయితే ఈ లయం ప్రతికూలమైనది కాదు. పాతది అంతమైతేనే కొత్త సృష్టికి మార్గం సుగమమవుతుంది. శివుడు తన తాండవంతో అజ్ఞానం, అహంకారాన్ని లయం చేసి, ఆత్మను దైవంలో విలీనం చేస్తాడు. మనలో చెడు ఆలోచనలను నశింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయనను సృష్టి చక్రంలో మార్పును తెచ్చే పరమాత్మగా పూజిస్తారు.


