News May 11, 2024

పార్వతీపురం: కుక్కలదాడిలో వృద్ధురాలు మృతి

image

జియ్యమ్మవలస మండలం వెంకటరాజుపురం గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70)బహిర్భూమికి వెళ్ళగా అకస్మాత్తుగా కుక్కలు గుంపు వచ్చి ఆమెపై దాడి చేశాయి. శరీరమంతా ముక్కలుగా కొరకటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా కుక్కలు చాలామందిని గాయపరుస్తున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. 

Similar News

News February 23, 2026

బోద నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో బోద (ఫైలేరియా) నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. గుర్ల మండలంలో ఇప్పటివరకు 5,516 మందికి డీఈసీ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 7,710 మందికి మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

News February 23, 2026

VZM: ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 20,430 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 19,568 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 862 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.

News February 23, 2026

VZM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్.పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించి, వారికి కల్పించిన వసతులపై అధికారులను ఆరా తీశారు.