News November 2, 2024
పార్వతీపురం: గదబవలస సమీపంలో ఏనుగుల బీభత్సం
పార్వతీపురం మండలం గదబవలస గ్రామ సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రహదారిపై వెళ్తున్న ఆటోను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఏనుగులు వస్తున్న సమయంలో ఆటోలో ఉన్న కార్మికులు గమనించి పరుగులు తీశారు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News December 2, 2024
VZM: లీగల్ వాలంటీర్లుగా అవకాశం
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి TV రాజేశ్ కోరారు. పదోతరగతి చదివి తెలుగు చదవడం, రాయడం రావాలన్నారు. క్రిమినల్ కేసులు ఉండరాదని సూచించారు. శిక్షణ కాలంలో గాని, శిక్షణ పూర్తైన తరువాత గాని ఎటువంటి జీతభత్యాలు ఉండవన్నారు. కేవలం సమాజ సేవ దృక్పథం గల వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News December 1, 2024
మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎంకు లేఖ
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో నిర్వహిస్తున్న అత్యం మైనింగ్ ప్రైవేట్ కంపెనీపై చర్యలు చేపట్టాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. మండలంలోని 10 గ్రామాలలోని కొండలను మైనింగ్ కంపెనీ ఆక్రమిస్తుందని అన్నారు. దీనిపై ప్రశ్నించిన ఆయా గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని కోరారు.
News December 1, 2024
VZM: అలా జరిగి ఉంటే వాళ్లు బతికే వాళ్లేమో..!
భోగాపురం రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళానికి చెందిన అభినవ్ భార్య మణిమాల విశాఖలో పరీక్ష రాయాల్సి ఉంది. అభినవ్ ఫ్రెండ్ కౌశిక్ వాళ్ల మేనమామ అమెరికా నుంచి వస్తుండటంతో రిసీవ్ చేసుకోవడానికి విశాఖకు బయల్దేరారు. ‘మేమూ నీతో వస్తాం’ అంటూ మణిమాల, అభినవ్ అదే కారులో బయల్దేరారు. ఒకవేళ ఆ భార్యాభర్త వేరుగా విశాఖకు బయల్దేరి ఉంటే బతికేవారేమో. విధి ఆడిన నాటకంలో ఇలా చనిపోయారని బంధువులు వాపోయారు.