News April 12, 2025

పార్వతీపురం: ‘గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత’

image

పార్వతీపురం జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, ఇచ్చిన లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతీ మండలంలో నెలకు 1,000 గృహాలు పూర్తిచేయాలని లక్ష్యాలను నిర్దేశించామని, కనీసం 500 గృహాలైన పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మే నెలలోగా 1,600 గృహాలు పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 20, 2025

Google: భారీగా భారత ఉద్యోగుల తొలగింపు!

image

గూగుల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసుల్లోని వందలాది మంది ఎంప్లాయిస్‌కు లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచే జాబ్ కట్స్ మొదలవ్వొచ్చని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ టీమ్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.

News April 20, 2025

మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

News April 20, 2025

కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.

error: Content is protected !!