News April 12, 2025

పార్వతీపురం జిల్లాకు 6వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 5,867 మంది పరీక్షలు రాయగా 4,519 మంది ఉత్తీర్ణులయ్యారు. 77% పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 5,335 మందికి 4,609 మంది పాస్ కాగా 86% పాస్ పర్సంటేజీతో 7వ స్థానంలో నిలిచింది.

Similar News

News February 26, 2026

GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8  తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.

News February 26, 2026

ఏలూరు: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 15,972 హాజరయ్యారని చెప్పారు. 385 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారని వివరించారు. జనరల్ విద్యార్థులు 14,128, ఒకేషనల్ విద్యార్థులు 1,844 మంది పరీక్ష రాశారని వివరించారు. దీంతో పరీక్షా శాతం 98 శాతంగా నమోదు అయిందన్నారు.

News February 26, 2026

భారత్ ప్లేయింగ్-11 అంచనా.. ఎలా ఉంది?

image

T20WC: భారత్ సెమీస్ వెళ్లాలంటే నేడు జింబాబ్వేతో తప్పక గెలవాల్సిందే. రా.7 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ప్లేయింగ్-11 ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కొందరు స్పోర్ట్స్ అనలిస్టుల ప్రకారం తుది జట్టు..
భారత్: అభిషేక్, ఇషాన్, సంజూ శాంసన్, సూర్య (C), తిలక్ వర్మ, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
> టీమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.