News August 2, 2024

పార్వతీపురం జిల్లాలో ఇద్దరు కార్యదర్శులు సస్పెండ్

image

పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా పార్వతీపురం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో వాస్తవమని వెల్లడికావడంతో పాచిపెంట మండలం కేసలి పంచాయతీ గ్రేడ్-4 కార్యదర్శి సేనాపతి సునీత. గ్రేడ్-5 కార్యదర్శి వాసును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News November 4, 2025

VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

image

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.

News November 4, 2025

యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష: విజయనగరం ఎస్పీ

image

జామి మండలం మాదవరాయమెట్ట గ్రామానికి చెందిన వంతల శివ (23)పై పోక్సో కేసులో నేరం రుజువై 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధిత బాలికకు రూ.50వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. కేసు దర్యాప్తు చేసి, నిందితుడిని శిక్షించడంలో జామి పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. 2024లో బాలికపై అత్యాచారానికి పాల్పాడగా శిక్ష ఖరారైందని తెలిపారు.

News November 4, 2025

ప్రజా సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించండి: SP

image

ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 54 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో భూగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందనతో 7 రోజుల్లో పరిష్కారం కల్పించాలని సూచించారు.