News February 10, 2025
పార్వతీపురం జిల్లాలో ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్

రెవెన్యూ శాఖలోని మ్యూటేషన్లు పరిష్కార నేపథ్యంలో విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మరో వీఆర్వోకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆర్టికల్ ఆఫ్ చార్జెస్కు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సాలూరు మండలం శివరాంపురం వీఆర్వో దాడి చిన్నయ్య, సీతంపేట మండలం పుల్లిపుట్టి వీఆర్వో ఎ.అయ్యప్ప సస్పెండ్ చేశారు.
Similar News
News September 17, 2025
శ్రీకాకుళం జిల్లాలో భారీగా పడిపోయిన బంతి పూల ధరలు

శ్రీకాకుళం జిల్లాలో బంతి పూల ధరలు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వినాయక చవితి సమయంలో కిలో రూ.50-60 పలకగా ఆ తర్వాత ధర క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీకి రూ.20 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలోకు రూ. 35-40 వరకూ వస్తే పెట్టుబడులైనా దక్కుతాయని అంటున్నారు. రాబోయే దసరా సీజన్ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకున్నారు.
News September 17, 2025
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
News September 17, 2025
NGKL: తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పంపల్లి కీలకం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో MBNR జిల్లాలోని అప్పంపల్లి గ్రామం కీలక పాత్ర పోషించింది. ఈ గ్రామం నుంచి 11 మంది పోరాటంలో పాల్గొని అమరులయ్యారు. పోరాటంలో చాకలి కిష్టన్నను నిజాం పాలకులు మొదట చంపినా, లింగోజిరావు వంటి వీరులు వెనుకడుగు వేయకుండా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ విలీనానికి కృషి చేశారని చరిత్ర చెబుతోంది.