News February 10, 2025

పార్వతీపురం జిల్లాలో ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్ 

image

రెవెన్యూ శాఖలోని మ్యూటేషన్లు పరిష్కార నేపథ్యంలో విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మరో వీఆర్వోకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆర్టికల్ ఆఫ్ చార్జెస్‌కు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సాలూరు మండలం శివరాంపురం వీఆర్వో దాడి చిన్నయ్య, సీతంపేట మండలం పుల్లిపుట్టి వీఆర్వో ఎ.అయ్యప్ప సస్పెండ్ చేశారు. 

Similar News

News March 26, 2025

ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.

News March 26, 2025

ఏలూరు : ముళ్ల పొదల్లో పసికందు.. మృతి

image

తూ.గో జిల్లాలో పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.

News March 26, 2025

RKP: యువకుడిపై పోక్సో కేసు నమోదు: SI

image

రామకృష్ణాపూర్‌‌కు చెందిన బాలిక(10) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ధృవ‌కుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు‌పడ్డ యువకుడు నీటి సీసా కోసం వచ్చిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.

error: Content is protected !!