News February 26, 2025
పార్వతీపురం జిల్లాలో ఎంత మంది MLC ఓటర్లు ఉన్నారంటే..!

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఇందులో 1,574 మంది పురుషులు 759 మంది మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల విధుల కోసం 18 మంది పిఓలు, 18 మంది ఏపీవోలు, 36 మంది ఓపిఓలు, 18 మంది ఏవోలను నియమించినట్లు చెప్పారు.
Similar News
News February 26, 2025
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అతిరుద్ర మహా యజ్ఞానికి చోటు

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈనెల 14 నుంచి 25 వరకు జరిగిన అతిరుద్ర మహా యజ్ఞం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. దాదాపు 83 దేశాలకు చెందిన శ్రీ సత్యసాయి భక్తులు లక్షలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అతిరుద్ర మహా యజ్ఞాన్ని తిలకించారని నిర్వాహకులు తెలిపారు. సత్య సాయి ట్రస్టు సభ్యులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన పుస్తకాన్ని నిర్వాహకులు అందజేశారు.
News February 26, 2025
ఆమనగల్: ప్రహరీ మోక్షం ఎప్పుడు.?

ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ ప్రహరీ నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నాలుగు మండలాలకు కూడలిగా ఉన్న ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌కు ప్రతినిత్యం వందల సంఖ్యల రైతులు వస్తుంటారు. ఆమనగల్ గుర్రం గుట్ట కాలనీ వైపు గల ప్రహరీ కూలడంతో ప్రతినిత్యం పందులు, మార్కెట్లోకి స్వైర విహారం చేస్తున్నాయి. ప్రహరీ కూలిన ప్రదేశంలో మినీ డంపింగ్ యార్డ్ తలపిస్తోంది. ఇప్పటికైనా ప్రహరీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
News February 26, 2025
అన్ని దేశాలూ సెంచరీలు.. పాక్ మాత్రం..!

ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (177) శతకం బాదారు. దీంతో పాకిస్థాన్ తప్ప టోర్నీలో పాల్గొన్న అన్ని జట్లు సెంచరీలు నమోదు చేశాయి. 2 మ్యాచులు ఆడినా పాక్ నుంచి ఏ ఒక్కరూ సెంచరీ చేయలేకపోయారు. దీంతో SMలో నెటిజన్లు ఆ జట్టును ట్రోల్స్ చేస్తున్నారు. బంగ్లాపైనైనా పాక్ ఆటగాళ్లు శతకం చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.