News March 26, 2025
పార్వతీపురం జిల్లాలో చేపట్టిన ప్రగతిని వివరించిన కలెక్టర్

అమరావతి రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరుగుతున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. జిల్లాలో చేపడుతున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకి కలెక్టర్ వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్య, పరిశ్రమలు, పర్యాటకం, రైల్వే, రవాణా మొదలగు రంగాల ద్వారా జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 28, 2025
రేపు వరంగల్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం వరంగల్ పర్యటనకు రానున్నారు. ఆయన భద్రకాళీ, వెయ్యి స్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను సందర్శిస్తారు. కాజీపేట, అయోధ్యపురంలోని రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కూడా ఆయన సందర్శించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలిపారు.
News November 28, 2025
తెప్పోత్సవం, ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 29న తెప్పోత్సవం, 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఈ ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. మిథిలా స్టేడియం ఉత్తర ద్వారంలో క్యూ లైన్ల ఏర్పాటు, భక్తుల ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, భద్రతా బలగాల మోహరింపు, తాగునీరు, వైద్య సేవలు, శానిటేషన్, టాయిలెట్స్ మౌలిక సదుపాయాలపై మార్గదర్శకాలు ఇచ్చారు.
News November 28, 2025
కృష్ణా: జనసేనకు దిక్కెవరు..?

కూటమి విజయంపై జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో TDP-YCP నేతలే పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. జనసేన నేతలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేదని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు టాక్. జనసేన MP ఉన్నా లేనట్టుగానే పరిస్థితి ఉండటంతో, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ చురుకుదనంపై కేడర్‌లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


