News April 7, 2025
పార్వతీపురం జిల్లాలో నకిలీ పోలీస్ అరెస్ట్

పోలీసునంటూ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పాలకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ.. ఎస్‌ఐ అబ్బాయి ఆస్పత్రిలో ఉన్నారని, డబ్బు పంపించాలని వీరఘట్టంలో పలువులు వర్తకులకు ఫోన్ చేసిన వ్యక్తిని సాంకేతిక పరిజ్ఞానంతో బాపట్లలో పట్టుకున్నామన్నారు. సీఐ చంద్రమౌలి, ఎస్‌ఐలు ప్రయోగమూర్తి, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
కడప: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.


