News March 7, 2025

పార్వతీపురం జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

image

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీశ్ జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతుంది.

Similar News

News December 7, 2025

జనగామ: గుర్తులు ఖరారు!

image

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. వార్డు మెంబర్, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో పోటీదారులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

News December 7, 2025

కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

image

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.

News December 7, 2025

హాజీపూర్: ఉద్యోగం వదిలి.. సర్పంచ్ బరిలో

image

హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మనుబోతుల అలేఖ్య సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని HDFC బ్యాంక్‌లో సేల్స్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా మంచి ఉద్యోగాన్ని చేస్తున్న ఆమె, గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ప్రస్తుతం గిరిజన గ్రామమైన ర్యాలీ గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె నిర్ణయం గ్రామంలోని యువతకు ఆదర్శంగా నిలిచింది.