News February 1, 2025
పార్వతీపురం: జిల్లాలో నేడు 1,40,460 మందికి పింఛన్ల పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లాలో నేడు 1,40,460 మందికి పింఛన్ల పంపిణీ చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు డీఆర్డీఏ పీడీ వై సత్యం నాయుడు తెలిపారు. పింఛన్ల పంపిణీకి రూ. 59.28 కోట్లు సచివాలయ సిబ్బందికి, ఉద్యోగులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో తొలిరోజు శతశాతం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు.
Similar News
News February 16, 2025
నిజాంసాగర్: ఆదర్శ పాఠశాలను సందర్శించిన జిల్లా నోడల్ అధికారి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను, కళాశాలను ఆదివారం కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి సలాం సందర్శించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షను ఆయన పర్యవేక్షించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
News February 16, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల సంగారెడ్డిలో ఈ నెల నుంచి 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు నుంచి తీసుకోవాలని సూచించారు.
News February 16, 2025
ఏపీ ఇష్టారాజ్యం-కాంగ్రెస్ చోద్యం: KTR

TG: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని KTR విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను KCR సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.