News March 7, 2025
పార్వతీపురం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు పార్వతీపురం జిల్లా నుంచి ఎక్కువగా బొబ్బిలికి వెళ్తుంటారు. బొబ్బిలిలో ఇంజినీరింగ్, డిగ్రి కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News December 1, 2025
ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి కేశవ్

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదిగవి గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. గంటపాటు విద్యార్థులకు పాఠం చెప్పారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల తెలివితేటలను చూసిన మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలలో అధిరోహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
News December 1, 2025
గద్వాల్: ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాదు నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో సమావేశం నిర్వహించారు. గద్వాల కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, నామినేషన్ల పరిశీలన జరిగిందన్నారు.
News December 1, 2025
పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.


