News March 7, 2025

పార్వతీపురం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు పార్వతీపురం జిల్లా నుంచి ఎక్కువగా బొబ్బిలికి వెళ్తుంటారు. బొబ్బిలిలో ఇంజినీరింగ్, డిగ్రి కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News March 27, 2025

కొత్తగూడెంలో నిరుద్యోగులకు GOODNEWS.. రేపే!

image

జిల్లాలో నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ గుడ్ న్యూస్ చెప్పారు. పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండి SSC, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలన్నారు. ప్రైవేటు కంపెనీల్లో 550 ఉద్యోగాలకు గాను ముఖాముఖి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

News March 27, 2025

నటి రన్యా రావుకు షాక్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో రన్యా రావుకు సహకరించిన సాహిల్ జైన్‌ను తాజాగా డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

News March 27, 2025

రాష్ట్రం దివాలా తీసింది అనడానికి ఆధారాల్లేవు: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పులకు తగినట్లే సంపద పెరిగిందని అసెంబ్లీలో చెప్పారు. అప్పులు లేని వ్యక్తి, దేశం ఉండదని అన్నారు. అమెరికాలాంటి దేశాలు కూడా అప్పులు చేశాయన్నారు. రాష్ట్ర ఏర్పడిన రోజు సగటు ఆదాయం రూ.3,500 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.18వేల కోట్లు ఉందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని అనడానికి ఆధారాలు లేవని చెప్పారు.

error: Content is protected !!