News April 6, 2024

పార్వతీపురం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు

image

జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు పటిష్ఠంగా జరిపేందుకు చర్యలు చేపట్టామన్నారు. నాలుగు నియోజకవర్గాలలో 48 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 36 స్టాటిక్ సర్వేలియన్స్ బృందాలు, 16 వీడియో సర్వేలియన్, 4 వీడియో వ్యూయింగ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News October 31, 2025

ఎస్ కోట: ‘ఖైదీల పట్ల వివక్ష చూపించరాదు’

image

ఎస్‌.కోట సబ్‌జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. కృష్ణ ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వివరించారు. ఖైదీలపై వివక్షత చూపరాదని హెచ్చరించారు. జైల్లో నడుస్తున్న లీగల్ ఎయిడ్ క్లినిక్స్ పనితీరును పరిశీలించారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News October 30, 2025

VZM: ఉద్యోగులకు క్రీడా ఎంపిక పోటీలు వాయిదా

image

ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు జరగాల్సిన క్రీడా ఎంపిక పోటీలను మొంథా తుఫాన్ కారణంగా నిరవధికంగా వాయిదా వేశామని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు వాయిదా వేశామని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల తదుపరి తేదీలు వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 30, 2025

ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.