News March 28, 2025
పార్వతీపురం జిల్లాలో భానుని ప్రతాపం

పార్వతీపురం మన్యం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పాచిపెంట, సాలూరు, భామినిలో సహా మిగిలిన మండలాలో రాబోయే 48 గంటలు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీంతో ఆ మండల వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News October 23, 2025
WGL: దారుణంగా పతనమైన పత్తి ధర..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు దారుణంగా పతనం అవుతున్నాయి. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,010 పలకగా.. నేడు రూ.6,810కి తగ్గింది. ఒకరోజు వ్యవధిలోనే ధర రూ.200 పడిపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News October 23, 2025
వరంగల్: క్వింటా తేజా మిర్చి ధర రూ.14,300

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు బుధవారం రూ.16,000 ధర పలకగా.. నేడు రూ.15,849 ధర పలికింది. వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,500 ధర వస్తే.. నేడు రూ.16,800 అయింది. తేజా మిర్చి బుధవారం రూ.14,400 ధర పలకగా.. గురువారం రూ.14,300 ధర వచ్చింది.
News October 23, 2025
కర్నూలు జిల్లాలో 52,076 ఇళ్లు మంజూరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం 52,076 ఇళ్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సచివాలయ పరిధిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 08518-257481ను సంప్రదించాలని సూచించారు.