News April 11, 2025
పార్వతీపురం జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. పర్వతీపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం జిల్లాలో వాతావరణ మారింది. పాచిపెంట, భామిని, సాల్లూరుతో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
Similar News
News February 24, 2026
రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. హాల్‌టికెట్ తీసుకున్నారా?

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఫస్ట్, సెకండియర్ కలిపి 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలవగా.. ఇంకా తీసుకోనివారు <
News February 24, 2026
ములుగు: డీజీపీ ఎదుట లొంగిపోయిన దామోదర్

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం అనంతరం లొంగిపోయాడు. అతనితో పాటు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఇతర నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ‘పోరుకన్నా.. ఊరు మిన్న’ పిలుపు ఫలితమిచ్చింది.
News February 24, 2026
పార్వతీపురం: ‘మార్ట్ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలి’

మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పార్వతీపుం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలతో గ్రామీణ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మార్ట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో ఉండాలన్నారు.


