News March 14, 2025
పార్వతీపురం జిల్లాలో రేపు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంపై సంబంధ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో ప్రజలు భాగం కావాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 5, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News December 5, 2025
పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై, వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
News December 5, 2025
‘కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో ఉంచాలి’

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. బోయినపల్లి, కోనరావుపేట మండలాలకు చెందిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల కాంట్రాక్టర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు, నిల్వలపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు.


