News February 24, 2025
పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు

పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని DVEO మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 500 మంది ఇన్విజిలేటర్లు, 34 మంది పర్యవేక్షకులు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 24, 2025
అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు: జగన్

AP: సభలో చర్చించేందుకు సమయం ఇవ్వాల్సి వస్తుందనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ఎక్కడా తగ్గం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. కళ్లు మూసి తెరిచేలోగా జమిలి ఎన్నికలు వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News February 24, 2025
జియో క్రికెట్ డేటా ప్యాక్.. 90 రోజులు ఉచితంగా!

క్రికెట్ అభిమానుల కోసం జియో సరికొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్ కోసం డేటాతో పాటు సబ్‌స్క్రిప్షన్ ఉండే ప్యాక్ తీసుకొచ్చింది. రూ.195 చెల్లిస్తే 15GB డేటాతో పాటు 90 రోజుల పాటు ‘JIO HOTSTAR’ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
News February 24, 2025
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

ఈ నెల 27న నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆల్ పార్టీస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఆమెతో పాటు ఎస్పీ జానకి షర్మిల, పలువురు నాయకులు ఉన్నారు.