News February 9, 2025
పార్వతీపురం: జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం
పార్వతీపురం మన్యం జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం ఈనెల 10న చేపడుతున్నట్లు DM&HO డాక్టర్ భాస్కరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3845 అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 55,234 మంది, 5 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 1,41,378 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి మాత్రలు అందేలా చర్య చేపట్టాలని సూచించారు.
Similar News
News February 9, 2025
దొంగను పట్టించిన నరసాపురం వాసులు
ఏసీ బోగీల్లో పనిచేస్తూ ఫోన్లు దొంగలిస్తున్న ఓ వ్యక్తిని గుంటూరు రైల్వే పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన నాగూర్ వలి తన భార్య బేగం, ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం లింగంపల్లి నుంచి నరసాపురం ఎక్స్‌ప్రెస్ 2ACలో ప్రయాణించారు. వారు ఫోన్ ఛార్జింగ్ పెట్టినిద్రపోగా.. వివేక్ ఫోన్ దొంగలించాడు. దీంతో అతడిని పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 9, 2025
ఏలూరు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రోగ్రాం నిలిపివేశామని, ప్రజలు గమనించాలని సూచించారు.
News February 9, 2025
కాళేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు
కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాళేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.