News April 13, 2025
పార్వతీపురం: జిల్లాలో 266 యూనిట్ల స్థాపనకు రూ.11.03 కోట్లు

పార్వతీపురం జిల్లాలో షెడ్యూల్ కులాల యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 266 యూనిట్ల స్థాపనకు రూ.11.03 కోట్లు కేటాయించినట్టు కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శనివారం తెలిపారు. స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈనెల 14 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తులు https://apobmms.apcfss.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు.
Similar News
News December 2, 2025
HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

హైదరాబాద్లో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News December 2, 2025
HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News December 2, 2025
WGL: నేనూ.. గ్రామానికి ప్రథమ పౌరుడిని..!

ఉమ్మడి జిల్లాలో GP ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. సర్పంచ్ పదవికి భారీ పోటీ ఉన్నా, గౌరవ వేతనం మాత్రం నెలకు రూ.6,500. 2015లో వేతనం రూ.5,000గా నిర్ణయించగా 2021లో రూ.6,500గా పెంచారు. అభివృద్ధి బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఆదాయం లేక అప్పులు మాత్రం భారం అవుతున్నాయి. అయినా ‘గ్రామానికి ప్రథమ పౌరుడు’ అన్న గౌరవం, ప్రతిష్ఠ కోసం రూ.లక్షలు ఖర్చు చేసి పోటీ పడుతున్నారు. మీ గ్రామాల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.


