News March 13, 2025

పార్వతీపురం జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

సారా, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్ శిక్షణకు వచ్చిన ఎస్ఐలకు పోలీస్ స్టేషన్లకు కేటాయించామన్నారు. వారు ప్రస్తుత ఎస్ఐలతో కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లో సారా, అక్రమమద్యం, గంజాయి, మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అక్రమ రవాణా చేసి పట్టుబడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Similar News

News March 14, 2025

నంద్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష

image

హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.11వేల జరిమానా విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి రాధారాణి తీర్పు చెప్పారు. తమ్మరాజుపల్లె గ్రామంలో 2017లో శివమ్మ అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. తన అక్రమ సంబంధం తెలిసిందనే కారణంతో కోడలు ప్రియుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడింది. అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష పడింది.

News March 14, 2025

ముదిగుబ్బ: కూతురిని తీసుకొచ్చేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

image

విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురిని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News March 14, 2025

సిద్దిపేట: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు(థియరీ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30గం. నుంచి 5:30 వరకు ఉంటాయన్నారు. పరీక్ష రుసుం చెల్లించిన వారే అర్హులని చెప్పారు. 26 నుంచి మే 3 వరకు ఇంటర్(ప్రాక్టికల్) పరీక్షలు ఉంటాయన్నారు. డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి.

error: Content is protected !!