News March 15, 2025
పార్వతీపురం జిల్లా పర్యటనకు ప్రత్యేక అధికారి

పార్వతీపురం జిల్లా ప్రత్యేక అధికారిగా డా. భరత్ నారాయణ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన జిల్లా పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వాగతం పలికారు. జిల్లాలో జరుగుతున్న ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆయనకు వివరించారు.
Similar News
News November 20, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీపై గురువారం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. HYD నుంచి జరిగిన ఈ సమీక్షలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అ.కలెక్టర్ శ్రీజ, తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్కాస్ట్లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.
News November 20, 2025
అనకాపల్లి: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయిన నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జేసీ జాహ్నవి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఈ-బ్యాంక్ గ్యారంటీలని పౌర సరఫరాల శాఖకు సమర్పించాలన్నారు. ధాన్యం సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.


